లుప్తాన్సా విమానంలోకి స్వాగతం, ఇది మీరు అనుకున్నదానికంటే ఎక్కువగా భారతీయమైన విమానయాన సంస్థ!

భారతదేశం లోపలకి మరియు బయటకి వెళ్ళే అన్ని లుఫ్తాన్సా ఫ్లైట్లలో అపూర్వమైన భారతీయ సద్భావం స్పష్టంగా కనపడుతుంది. భారతదేశంలో అర్ధ శతాబ్దానికి పైగా సేవ చేసిన మీదట ఇది పటిష్టత, విశ్వసనీయత మరియు టెక్నాలజీపరమైన ఉత్కృతలన్న మన సంప్రదాయంతో పడుగుపేకలో పెనవేసుకుంది.

మీరు ప్రయాణపు ప్రతి అడుగులోను, అది మా ఆతిథ్యం కానివ్వండి, ఫ్లైట్లో మీల్స్ లేదా వినోదం కానివ్వండి అన్నింట్లో మీరు భారతీయతని స్పర్శిస్తారు. మా దీర్ఘకాలిక భాగస్వామ్యంవల్ల మేము భారతీయ సంస్కృతిని మెచ్చుకుని ఆనందించడంలో దోహదం అయింది. మీ ప్రాధాన్యతలకు అనుగుణ్యంగా ఉత్పాదలను మలచడంలో తోడ్పడిండి. ఈ నిర్వారామ కృషివల్ల మీ నమ్మకాన్ని సాధించాం, భారతదేశంలో నం. 1 యూరోపియన్ ఎయిర్ లైన్స్ గా మమ్మల్ని నిలిపింది.

View More

విమానం లోపల: ఆకాశంలో భారతీయ స్పర్శ

Onboard

ప్రయాణం మొదలైన క్షణం నుంచి గమ్యం చేరుకునేంతవరకు కూడా భారతదేశం నుంచి వచ్చే లుఫ్తాన్సా ప్రయాణికులు, వారి అవసరాలకు సరిగ్గా సరిపడేట్టు మలచబడిన ఒక ప్రపంచంలోకి అడుగుపెడతారు. చదువుకోడానికి అనేక రకాల భారతీయ వార్తా పత్రికలు, మేగజైన్యు ఉంటాయి, డెడికేటెడ్ రేడియో ఛానళ్ళ పైన హిందీ ఫిల్మ్ మ్యూజిక్ చూసి ఆనందించేందుకు పాప్యులర్ బాలీవుడ్ సినిమాలు, రుచి చూసి ఆనందించేందుకు భారతీయ వంటకాలు, చక్కటి వేడి వేడి చాయి కూడా. ఇవన్నీ కలిపి ఆకాశంలో భారతీయత అనుభూతిని కలిగిస్తాయి.

చెక్ ఇన్ దగ్గర మొదటిసారి కాంటాక్టు ఏర్పడినప్పుడు అనుభవంగల భారతీయ గ్రౌండ్ సిబ్బంది, ఫ్లైట్ లోపల మీ సంరక్షణని చూసుకునే భారతీయ క్రూ సభ్యులు మీకు స్వాగతం పలికి సేవలందిస్తారు. యావత్ ఫ్లైట్ అనుభూతి కూడా ఇంటిలాంటి వాతావరణం సృష్టించేందుకు దోహదపడుతుంది.

View More

Inflight menu image

విమానం లోపల మెను: దేశీయ రుచి, దేశీయ మసాలాలు

మీరు భారతదేశం నుంచి లుఫ్తాన్సా ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఏ క్లాస్ లో వెడుతున్నప్పటికి ఎల్లప్పుడు కూడా మీరు ఆనందించే భారతీయ భోజనం లభిస్తుంది, మీరు రిజర్వేషన్ తోపాటు ఆసియన్ వెజిటేరియన్ భోజనాన్ని బుక్ చేసుకోండి, అంతే భారతీయుల ప్రత్యేక జిహ్వకు సరిపడేలా సంప్రదాయ మసాలా దినుసులతో వండిన భోజనాన్ని కడుపు నిండా తిని ఆనందిస్తారు. మా ఫస్ట్ మరియు బిజినెస్ క్లాస్ ప్రయాణీకులను మరింత సంతోషం పెట్టేందుకు సుప్రసిద్ధ చెఫ్ కునాల్ కపూర్, టాప్ చెఫ్ సురేందర్ మోహన్ తో జతగూడి, భారతదేశం నుంచి వెళ్ళేవి, వచ్చే లుఫ్తాన్సా ఫ్లైట్ల లోపల అద్భుతమైన భారతీయ వంటకాల పైన తమ ప్రత్యేక ముద్రని వేస్తారు. నిజానికి అత్యుత్తమ భారతీయ వంటకాన్ని ఎంచడానికి లుఫ్తాన్సా దేశ వ్యాప్తంగా భారతదేశంలో కుకింగ్ పోటీ నిర్వహించింది, పోటీలో గెలుపొందిన వంటకం ఫస్ట్ మరియు బిసినెస్ క్లాస్ ఫ్లైట్ లోపల మెనూలో చేరింది.

View More

Inflight entertainment image

విమానం లోపల వినోదం: నాకు బాలీవుడ్

లుఫ్తాన్సా విమానం లోపల గోల్డెన్ మెలొడీలు లేదా సరికొత్త బాలీవుడ్ హిట్ లు, డెడికేటెడ్ ఇండియన్ మ్యూజిక్ ఛానల్ రిథమ్స్ ఆఫ్ ఇండియాలో మీకు కావలసిన మ్యూజిక్ వీటిని ఆనందించండి. మీ హెడ్ ఫోన్ లు పెట్టుకుని రిలాక్చ్ గా కూర్చోండి, అంతే మీరు అనుకున్నదానికంటే ఎక్కువగా భారతీయ ప్రత్యేకత కనపడే విమాన ప్రయాణ అనుభూతి పొందేందుకు తయారుగా ఉండండి. భారతీయ వార్తా పత్రిక లేదా మేగజీన్ చేతిలోకి తీసుకోండి, తాజా సమాచారం మీ ముందు ఉంటుంది! మీరు మేఘాలుపై నుంచి విమానంలో ఎగిరిపోతూ ఉండగా ఫ్లైట్ లోపల ఉండే అనంతమైన ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమంలో భాగంగా దొరికే అనేక బాలీవుడ్ సినిమాలు, టీవీ షోస్ లో మీకు ఇష్టమైంది ఎంచుకుని చూసి ఆనందించండి. మీరు లుఫ్తాన్సాలో ఫ్లై చేస్తున్నారంటే అది వెనక్కి వాలి, రిలాక్స్ డ్ గా కూర్చుని ఆకాశంలో స్వదేశీ వినోదాన్ని ఆనందించే తరుణం అన్నమాట.

మీకు తెలుసా?

సుమారు 30 ఏళ్ళ క్రిందట 1987లో భారతదేశం నుంచి వెళ్ళేవి, వచ్చేవి లుఫ్తాన్సా ఫ్లైట్ లలో ఇండియన్ మ్యూజిక్ ప్రవేశపెట్టబడింది.

View More

Indian crew

ఇండియన్ క్రూ: భారతీయ విమాన సిబ్బంది

భారతీయులు ఇచ్చే ఆతిధ్యం గురించి ప్రపంచం అంతటికే తెలుసు. అందుకే లుఫ్తాన్సా ఇంచుమించు 200 మంది భారతీయ ఫ్లైట్ అటెండెంట్ లను నియమిస్తుంది. బాగా శిక్షణ పొంది, ఎంతో సహాయకారిగా ఉండే మా గ్రౌండ్ సిబ్బంది సహాయంతో విమానాశ్రయంలో ఒకసారి మీరు చెక్ ఇన్ అయిపోయిన తరువాత, మా భారతీయ విమాన సిబ్బంది, మీరు మీ ఫ్లైట్ లో సొంత ఇంట్లో ఉన్నంత సౌఖ్యంగా ఉండేటట్టు చేస్తారు.

మీరు గమ్యం చేరుకోగానే ఫ్రాంక్ ఫర్ట్ వంటి రద్దీ గమ్యాలలో లుఫ్తాన్సా స్వాగత సేవ వారు మీకు హిందీ, తమిళం, పంజాబీ భాషలలో స్వాగతం పలుకుతారు. జర్మన్ లేదా ఇంగ్లీషు భాషలు రాని అతిధులకు సహాయపడే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ సర్వీసు ట్రాన్సిట్ కాలంలో మీ ఎరైవల్ ని మరియు స్టేని సులభతరం చేస్తుంది.

View More

లుఫ్తాన్సా మరియు భారతదేశం

Lufthansa India

మొదటి లుఫ్తాన్సా విమానం 1934లో భారతీయ భూభాగంలో దిగింది, అప్పుడు ఒక జెయు52 అందమైన జోధ్ పూర్ నగరంలో దిగింది. కానీ 1959 నవంబరులోనే లుఫ్తాన్సా భారతదేశంలో తమ కమర్షియల్ సర్వీసులను ప్రారంభించింది. లాక్ హేడ్ సూపర్ కాన్ స్టలేషన్ ఫ్లైట్ కోల్కత్తాకు ప్రయాణించడంతో ఈ సర్వీసులు మొదలయ్యాయి. అప్పటి నుంచి భారతదేశంతో లుఫ్తాన్సా భాగస్వామ్యం ఆ ఏడాదికెడాది పటిష్టం అవుతూ వచ్చింది. అనేక సంవత్సరాలలో భారతదేశానికి మరియు భారతదేశం నుంచి లుఫ్తాన్సా ఫ్లైట్లు పెరుగుతూ ప్రతి వారం ఫ్రాంక్ ఫర్ట్ మరియు మ్యూనిక్ ల నుంచి 5 గమ్యాలకు - అంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పూణేలకు 46కి చేరుకున్నాయి. లుఫ్తాన్సా గ్రూపు విమానయాన సంస్థలు మొత్తం కలుపుకుని 4 ప్రపంచ రద్దీ కేంద్రాల నుంచి భారతదేశంలోని 5 నగరాలకు ప్రతివార 66 ఫ్లైట్లు నడుపుతున్నాయి. తద్వారా లుఫ్తాన్సాని నం. 1 గా చేశాయి.

మీకు తెలుసా?

భారతదేశం “క్వీన్ ఆఫ్ స్కైస్’’ లుఫ్తాన్సా బోయింగ్ 747-8కి స్వాగతం పలికిన తొలి దేశంగాను ప్రపంచ వ్యాప్తంగా రెండవ దేశంగా నిలిచింది.

View More

భారతదేశంలో లుఫ్తాన్సా చరిత్

Lufthansa history

గత అర్ధ శతాబ్ధంగా లుఫ్తాన్సా, నమ్మిక, నిబద్ధతల ఆధారంగా భారతదేశంతో చాలా దృఢమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకుంది రాజస్థాన్ లోని బంగారు ఇసుక తిన్నెల మధ్య జోధ్ పూర్ లో లుఫ్తాన్సా జంకర్స్ జెయు52 విమానం దిగడంతో 1934లో ఈ అద్భుత ప్రయాణం మొదలైంది. అయితే ఇది 1959లో లుఫ్తాన్సా లాక్ హీడ్ ఎల్1049జి సూపర్ కన్సల్టేషన్ కలకత్తాలో (ప్రస్తుతం కోల్కతా) దిగడంతో ఇది మొదటిసారి అధికారిక సంబంధంగా మారింది. ఈ విమానం కోల్కతాలో దిగడంతో భారతదేశానికి లుఫ్తాన్సా వారి షెడ్యూల్డ్ ఫ్లైట్లు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి విమానయాన పరిశ్రమ ఎగుడు దిగుడులకు గురి అవుతున్నా లుఫ్తాన్సా తన మార్గాన్ని అనుసరిస్తు సాగిపోయింది.

ఫ్లైట్లు, గమ్యాల సంఖ్య పెరుగుదల కొనసాగా దానిని దాటి లుఫ్తాన్సా, తన భారతీయ కస్టమర్ల అవసరాలను గౌరవిస్తు తన సర్వీసులను వాటి తగినట్టు మల్చడం ద్వారా ఈ భాగస్వామ్యానికి సాంద్రతని చేర్చింది. ఈ ప్రయాణపు మార్గంలో దాటిన మైలు రాళ్ళలో భారతీయ కేబిన్ క్యూ, భారతీయ సంగీతం, బాలీవుడ్ సినిమాలు ప్రవేశపెట్టడం, అనేక రకాల భారతీయ వంటకాలను అందించడం ఉన్నాయి.

1934

లుఫ్తాన్సా భారతదేశానికి మొదటి అన్వేషణ ఫ్లైట్ ని ప్రారంభించి జోధ్ పూర్ లో దిగింది.

1959

లుఫ్తాన్సా భారతదేశంలో తన మొదటి షెడ్యూల్డ్ ఆపరేషన్ లను ప్రారంభించి కోల్కతాకి నడిపింది.

1987

లుఫ్తాన్సా ఫ్లైట్ లోపల ఎంటర్ టేన్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా భారతీయ సంగీతం ప్రవేశపెట్టబడింది.

1996

ఇండియా రూట్లలో భారత కేబిన్ సిబ్బందిని ప్రవేశపెట్టారు.

2004

న్యూ ఢిల్లీ నుంచి ఫ్రాంక్ ఫర్ట్ కి ఫ్లైట్లతో సర్వీసు చేసే జర్మనీలోని లుఫ్తాన్సా రెండవ డెస్టినేషన్ గా మ్యూనిక్ రూపొందింది.

2009

సి ఎన్ బి సి ఆవాజ్ ట్రావెల్ ఎవార్డ్ లలో లుఫ్తాన్సాని “భారతదేశంలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్’’గా ఎంపిక చేయబడింది.

2011

ఔట్ లుక్ ట్రావెలర్ లుఫ్తాన్సాకి “ఫేవరిట్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్’’గా అవార్డు ఇచ్చింది.

2012

న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లుఫ్తాన్సా లౌంజ్ తెరవబడింది.

2012

లుఫ్తాన్సా ఢిల్లీ-ఫ్రాంక్ ఫర్ట్ మరియు బెంగళూరు-ఫ్రాంక్ ఫర్ట్ రూట్లలో అన్నీ క్రొత్త బోయింగ్ 747-8లను ప్రవేశపెట్టింది, దానితో భారతదేశం క్రొత్త విమానాలు మరియు క్రొత్త ఫుల్-ఫ్లాట్ బిజినెస్ క్లాస్ సీట్లు పొందిన తొలి ఆసియా దేశం అయింది.

2014

డైరెక్ట్ మార్కెటింగ్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఇసిహెచ్ఓ అవార్డులలో లుఫ్తాన్సా ఇండియా 4 గోల్డ్ లు, 4 సిల్వర్ లు మరియు 1 బ్రాంజ్ సంపాధించింది. లుఫ్తాన్సా గెలుచుకున్నారు ఎయిర్ లైన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం – యూరప్ & నార్త్ అమెరికా, GMR-IGI అవార్డ్స్ లో వరుసగా 3 వ సారి .

50 సంవత్సరాలు పైబడిన నమ్మకం మరియు నిబద్ధత

Testimonial banner

భారతదేశం పట్ల మా ప్రతిబద్ధత మరియు గత అర్థ శతాబ్దం కాలంలో, క్రమక్రమంగా మా సర్వీసులను భారతీయంగా (ఇండియనైజేషన్) చేసేందుకు మేము జరిపిన కృషిని మా కస్టమర్లు, మా భాగస్వాములు, యావన్మంది భారతీయ ప్రయాణీకులు స్వాతగించారు. ఏడాది తరువాత ఏడాదిగా మమ్మల్ని అంతర్జాతీయ ట్రావెల్ పరిశ్రమలోనే కాకుండాముఖ్యంగా భారతీయ ప్రయాణాల రంగంలో కూడా అవార్డులతో సత్కరించడం జరిగింది.

వీటిలో ఇవి ఉన్నాయి:సి ఎన్ బి సి ఆవాజ్ ట్రావెల్ అవార్డ్స్ లో భారతదేశంలోని ఉత్తమ అంతర్జాతీయ విమానయాన సంస్థ అవుట్ లుక్ ట్రావెలర్లో ఫేవరేట్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్ మరియు 1వ వార్షిక జి ఎమ్ ఆర్-ఐజిఐ ఎయిర్ పోర్ట్ అవార్డ్స్ లో ఎయిర్ లైన్ ఆఫ్ దియర్-యూరప్. దీనితో మేము భారతదేశంలో నం. 1 యూరోపియన్ ఎయిర్ లైన్స్ గా రూపొందాము. అయితే ఈ ప్రశంసలన్నింటికి మించినది మా కస్టమర్ల మాటలే, మమ్మల్ని ప్రతి రోజు కూడా ఆకాశంలో మేఘాల ఆవల ఇంటికి దూరంగా ఇంటిని సమకూర్చేలా మా శక్తి కొద్దీ పాటుబడేటట్టు మమ్ము ప్రేరేపిస్తాయి.

View More

భారతదేశంలో లుఫ్తాన్సా కృషి గురించి మరిన్ని తెలుసుకోండి

దీపావళి పండుగ వేడుకలు చేసుకోడం నుంచి భారతీయ వంటకాల పారంపరిక సంపదని ప్రదర్శించి చూపడం వరకు, వ్యాపార దక్షతను పెంపొందించడం వరకు లుఫ్తాన్సా ఇండియా ఇటీవల చేపట్టిన కార్యక్రమాలు నిజమైన భారతీయతా సద్భావాన్ని ప్రతిబింబించాయి. భారతదేశంలో లుఫ్తాన్సా ముందు చొరవ తీసుకుని ఇక్కడ మరియు ఈ విమానయాన సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా గల నెట్‌వర్క్ ద్వారా అమలు చేయబడిన ఈ కార్యక్రమాలు దేశం మరియు ప్రపంచం వివిధ మూలాల ఉండే అనేక వేల మంది భారతీయులను ఈ కార్యక్రమాలలో పాలుపంచుకునే చేసాయి.

ఎందుచేత లుఫ్తాన్సా మీరు అనుకున్నదాని కంటే ఎక్కువ భారతీయత కలిగినదో మీరు స్థూలంగా తెలుసుకునేందుకు ఇక్కడ కొన్నింటిని సమర్పిస్తున్నాము.

View More